రాజ్యాంగ భారతంలో సంఘ బహిష్కరణ ? ఎంతటి దిగజారుడు ?

విశాఖపట్నం: గానుగ కులవృత్తికి చెందిన ఒక జిల్లా స్థాయి సంఘంలో సభ్యుల మధ్య విభేదాల నేపథ్యంలో, గ్రూపు కలహాల కారణంగా రాష్ట్ర శాఖ అధ్యక్షులు అదే విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని సంఘ సభ్యత్వానికి దూరం చేస్తూ (Termination of Membership / Removal of the Name from the Register of Membership) నిర్ణయం తీసుకొని కరపత్రాలను పోలిన లేఖ విడుదల చేస్తూ వివాదాలకు కారణమయ్యారని ఆరోపిస్తున్న ఆ వ్యక్తిని “సంఘ బహిష్కరణ (Community Expulsion)” చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయడం పట్ల రాష్ట్రంలోని కొందరు సాటి కుల సభ్యులు నేటి కాలంలో “సంఘ బహిష్కరణ” సమంజసమా ? అని నర్లెళ్ళబెట్టుకుంటున్నారు. సంఘ బహిష్కరణ అన్న పదం వాడటం సదరు వ్యక్తి యొక్క పరువుకు భంగపాటు అని, అలాంటి తీవ్రమైన పదాలు వాడకుండా ఉంటే బాగుండేదని పలువురు గానుగ కుల సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started