తిరుపతి: ఆంధ్రప్రదేశ్ గాండ్ల మరియు తెలికుల సంక్షేమ సంఘం నందు త్వరలో ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లూరు రెడ్డి వరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాండ్ల మరియు తెలికుల సామాజిక వర్గం వారు ఈ సంఘము నందు సభ్యత్వమును ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకోవచ్చని, అలా సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి సభ్యత్వ ధ్రువీకరణ ఐడెంటిటీ కార్డు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా కింద రూ. 200,000/- (రెండు లక్షల రూపాయలు) ఇన్సూరెన్స్ కల్పించబడుతుందని ఆయన తెలిపారు. సభ్యత్వ రుసుము ఎంత అన్నది త్వరలో కోర్ కమిటీ మీటింగ్లో నిర్ణయించి తెలియజేస్తామని ఆయన అన్నారు.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started