
గాండ్ల /తేలికుల / దేవతెలికుల కులాలకు చెందిన ప్రతిభ కనబరచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ ప్రధానం చేయనున్నట్లు ఆ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర సంఘం ప్రకటన వెలువడించింది. దరఖాస్తు విధానంపై మరియు నియమ నిబంధనలు తెలియజేస్తూ ఈ క్రింది విధంగా ఆ ప్రకటన ఇవ్వడం జరిగింది.
స్వర్గీయ గ్రోసు.గోపాలయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్ ఎంపిక ప్రక్రియ , నియమ నిబంధనల గురించి
1.ఎస్.ఎస్.సి, మరియు సీనియర్ ఇంటర్ ( బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్) 2021-22 విద్యా సంవత్సరంలో పూర్తి చేసిన A.P స్టేట్ లో ఉన్న మన కుల విద్యార్థులు అర్హులు …
2. ఏ జిల్లాలో చదివినప్పటికీ శాశ్వత చిరునామా గల జిల్లాలో మాత్రమే
దరఖాస్తు చేయాలి..
3. జూలై 24 వ తేదీలోగా జిల్లా శాఖల విద్యా కమిటీ లకు దరఖాస్తులను మార్కుల లిస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు జెరాక్స్ లతో పాటు అందజేయాలి..
4. జిల్లా విద్యా కమిటీలు దరఖాస్తుల పరిశీలన చేసేటప్పడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు / నిరుపేద కుటుంబం నకు చెందిన విద్యార్థులకు 5 మార్కులు అదనంగా జోడించి (గ్రేస్ మార్కులు అత్యధికంగా 5 మార్కులు మాత్రమే) తుది ఎంపిక పూర్తి చేసి ఎస్.ఎస్.సి టాపర్ ఒకరిని, సీనియర్ ఇంటర్ టాపర్ ఒకరిని ( గోల్డ్ మెడల్ కొరకు) తదుపరి టాపర్స్ ముగ్గురు చొప్పున ( మెరిట్ సర్టిఫికేట్ కొరకు ) జూలై 30 తేదీలోగా రాష్ట్ర శాఖ విద్యా కమిటీ కు అందజేయాలి…
5. రాష్ట్ర విద్యా కమిటీ జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఆమోదించి తుది జాబితా ప్రకటిస్తుంది.. జిల్లాల కు సమాచారం ఇస్తూ అభ్యర్ధులను గోల్డ్ మెడల్ ప్రదానం నకు ఆహ్వానిస్తుంది…
6.ప్రతీ జిల్లా లో ఎస్.ఎస్.సి టాపర్ ఒకరికి , సీనియర్ ఇంటర్ టాపర్ ఒకరికి గోల్డ్ మెడల్, నగదు ప్రోత్సాహకం మరియు మెరిట్ సర్టిఫికేట్ అందించబడుతుంది.. మరియు ప్రతీ జిల్లా కు ఎస్.ఎస్.సి , సీనియర్ ఇంటర్ తదుపరి టాపర్స్ ముగ్గురు చొప్పున మెరిట్ సర్టిఫికేట్ లు అందించబడును. ( ఇవి జిల్లా శాఖ కు పంపబడతాయి)..
కావున జిల్లా శాఖలు బాధ్యత వహించి మీ మీ జిల్లా లలో అన్ని మండలాల లో మన కుల విద్యార్థులకు, తల్లిదండ్రులకు పై సమాచారం తెలిసే విధంగా వాట్సాప్ ప్రకటనలు చేయాలి, ఫోన్ ద్వారా తెలియజేయాలి..
మీ అందరి సహకారం, సూచనలతో ఈ స్వర్గీయ గ్రోసు.గోపాలయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది అని భావిస్తున్నాను…
@ బొర్రా మధుసూధన్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్