
కులాలు జీవన వృత్తులు ఆధారంగా, జీవన వైవిధ్యాల ఆధారంగా పుట్టుకొచ్చాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే.
భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 19 (1) (g) ప్రకారం ప్రతి ఒక్కరు వృత్తి ఆచరణ హక్కుని పొందారు, అంటే… భారతదేశ పౌరులు కుల వృత్తులకు అతీతంగా ఏ వృత్తినైనా ఎంచుకొని జీవనం పొందవచ్చు. గానుగ కుల సంఘాలు గానుగ వృత్తిని ఎంచుకోండని యువతకు పిలుపునివ్వవచ్చు. ఈ వృత్తిని మనమే ఆచరించాలి ఇతరులు ఆచరించకూడదు అని రెచ్చగొట్టకూడదు, ఇది రాజ్యాంగ విరుద్ధం.
ప్రతి కుల సంఘం యొక్క ముఖ్య లక్ష్యం ఆ యొక్క కులం ఈ సమాజంలో ఆర్థికంగా మరియు సామాజికంగా బలోపేతం చేయాలని. ఆర్థికంగా బలోపేతం అవ్వాలంటే ఎంచుకున్న వృత్తి రంగంలో, లేదా విద్యారంగంలో ప్రతిభ కనపరచి ఆర్థికంగా బలపడాలని, తద్వారా క్రమేపీ సామాజికంగా కూడా బలపడతారనేది కుల సంఘాల యొక్క భావన. వృత్తిరంగం మరియు విద్యారంగం కాకుండా ఇక్కడ మరొక రంగం వ్యక్తులను సామాజికంగా బలపరుస్తుంది… అదే, రాజకీయ రంగం. నేటి సమాజంలో అన్ని రంగాలను కుల ప్రాతిపదికన శాసించే స్థాయిలో రాజకీయ రంగం కూర్చుంది.
గానుగ కులానికి చెందిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా స్థిరపడ్డ వారిని వేళ్ళ పై లెక్కపెట్టవచ్చు. కారణం కుల జనాభా సంఖ్య తక్కువ, అరకొర ఉన్న జనాభా యొక్క ఆదరణ వారికి లేకపోవడం. మన సాటి కులస్తుడు స్థానికంగా ఎవరైనా రాజకీయాల్లో పోటీ చేస్తే, అక్కడి మనవారు అందరూ సపోర్ట్ చేయటం లేదు అన్నది తరచూ వినపడుతూ వుంటుంది. సపోర్ట్ చేయకపోగా స్వయం శక్తితో రాజకీయాల్లో సక్సెస్ అయిన పరిస్థితుల్లో… పైగా వాళ్లే కులస్తులకు సదరు వ్యక్తి ఏమి మంచి చేయలేదని ఆరోపణలు చేస్తుంటారు. ఎందుకు చేయాలి ? ఎటువంటి సహకారం అందించనప్పుడు ఏమాత్రం గౌరవించినప్పుడు, కనీసం అభినందించనప్పుడు ఏటువంటి మీకు ఎందుకు మంచి చేయాలి ? అని వారు ఆలోచించడం లో తప్పు లేదు. కుల ముద్ర తో (సపోర్ట్) రాజకీయంగా ఎదిగి, ఉన్నత స్థానంలో వున్న వారు కులానికి చేస్తారెమో…. కానీ కులం సపోర్ట్ చేయకపోయినా స్వశక్తి తో ఎదిగిన వాడు కులానికి మంచి చేయాలని రూలు లేదు. అలా అని వారికి కుల అభిమానం లేకపొదు.
ఒకే వూర్లో రెండు పార్టీలు వుంటే, ప్రతిపక్షం లో వున్న మన కులం వాడికి, అధికారం లో వున్న మనోడే రేషన్ కార్డు, గృహం వంటి వాటికి దరఖాస్తు చేసుకుంటే మంజూరు రాకుండా ఆపెస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకు ఈ ద్వేషాలు ? ఎందుకు ఈ ఈర్ష్య లు ?
మన వాడికి మనం సపోర్ట్ చేయకపోతే ఇతర కులం వాడు వచ్చి చేస్తాడా ?
మనిషికి ఈర్ష్య అనేది సర్వసాధారణ లక్షణమే… కానీ ఎవరిమీద ఈర్ష్య ? సాటి కులస్తుడు మీద ! కులం అంటే కుటుంబం… నీ కుటుంబ సభ్యుడు ఏదుగుతుంటే తట్టుకోలేరు, పైగా యెత్తి పొడుపు మాటలు విసురుతూ, ఎందుకు ? నీ ఇంట్లో నీ కొడుకో, కూతురో ఐఏఎస్ సాధిస్తే ఈర్ష్య పడతావా ? మరి ఎందుకు నీ కుల బంధువు కొడుకు సాధిస్తే ఈర్ష్య ?
ఈర్ష్య లు కాలక్రమేణా ద్వేషాలు గా, తర్వాత కోపం గా, గొడవ గా, పగ గా, ప్రతీకారాల వరకు తీసుకెళ్తాయి. ఈ ఈర్ష్య లు కొన్నిసార్లు ఎంత వరకూ తీసుకువెళ్తాయో మరి ఎక్కడితో ఆగిపోతాయో తెలియదు.
ఎవడికి వాడు కోట్ల రూపాయలు సంపాదించుకుని స్థిరపడి పోతే వ్యక్తిగతంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు తప్ప, కలిసి మెలసి ఐకమత్యంగా వుండి సంస్థాగతంగా ఒక్క చోట చేరితే సామాజికంగా ధృడంగా అభివృద్ధి చెందుతారు. అప్పుడే రాజ్యాలను పాలిస్తున్న ఇతర కులాలు మన కులాన్ని గుర్తిస్తాయి. ఎప్పుడో ఒకప్పుడు ఎదో ఒకచోట రాజ్యాధికారం మన వాడి చేతికి రాకపోదు. అప్పుడు సంఘాలు అడుగుతున్న కమ్యూనిటీ భవనాలు, కళ్యాణ మండపాలు, విద్యుత్ రాయితీలు, సబ్సిడీతో కూడిన లోన్లు వస్తాయి, కుల ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి తోడ్పడతాయి. ఐకమత్యంగా జనసంఖ్యను చూపించుకోకపోతే ఏ ప్రభుత్వము సామాజిక వర్గాలను గుర్తించదు. ఇవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలు.
కుల సంఘాలలో చేరాలంటే, కుల సమావేశాలకు హాజరు అవ్వాలంటే చాలామంది ఖర్చుతో కూడుకున్న పని అని, సభ్యత్వ రుసుములు కట్టాలేమో, చందాలు డొనేషన్లు ఇవ్వాలేమో అని కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారని తెలిసింది. కుల సంఘాలు కులస్తుల సంక్షేమం కోసం ఆర్థిక సహాయం కొరకు చందాలు, డొనేషన్లు ఇవ్వమని పిలుపునిస్తారేమో గాని, లేనివాడిని కట్టమని కష్ట పెట్టరు. ఇలాంటి అపోహలతో మండల మరియు గ్రామస్థాయిలో మన కులస్తులు సంఘాలలో సంగటితం కాలేకపోతున్నారు. ఈ అపోహలు మాని సంఘాలలో సంఘటితమై కుల ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి తోడ్పడండి.
కుల సంఘాలలో నాయకత్వం కూడా కాలానుగుణంగా మారుతూ ఉండాలి, కులానికి మేమే దైవంశ సంభూతులమన్నట్టు తిష్ట వేసి నియంతృత్వపు పోకడను అవలంబించడం కుల సామాజిక అభివృద్ధికి గొడ్డలి పెట్టు.
Article by:
Dr Singanamala Suman
YSR KADAPA.
Mobile: 8125888880
Leave a comment