విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గాండ్ల, తెలికుల సంక్షేమ సంఘం (APGTCWA) ఆధ్వర్యంలో రాష్ట్రంలో గానుగ కుల సామాజిక వర్గానికి చెందిన, గాండ్ల, తెలికుల మరియు ఇతర పేర్లతో పిలవబడుతున్నటువంటి గానుగ కుల సామాజిక వర్గానికి చెందిన వారి కుటుంబాల యజమానులకు (మాత్రమే) ఈ సంఘము నందు సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గానుగకుల సామాజిక వర్గాల కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ? అదేవిధంగా ఎంతమంది జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నారు అనే విషయాలు తెలుసుకోవచ్చు. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి గానుగ సామాజిక వర్గ అభ్యున్నతికి కావాల్సిన సంక్షేమ పథకాలు తీసుకు వచ్చేందుకు ఏపీ గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం పోరాడుతుంది. ఈ కార్యక్రమంలో కేవలం కుటుంబ యజమాని వివరాలు మాత్రమే పొందుపరచగలరు. ఆయా కుటుంబ యజమానులు సభ్యత్వం నమోదు చేసుకున్న తర్వాత ప్రతి కుటుంబానికి కుటుంబ యజమాని పేరిట ఒక సభ్యత్వ నమోదు గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కుటుంబ సభ్యుల సంఖ్య పొందుపరచడం జరుగుతుంది. తర్వాత రెండవ దశ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో యజమాని కింద కుటుంబ సభ్యులకు సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకురావడం జరుగుతుంది.
సభ్యత్వం నమోదు కొరకు ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి

Leave a comment